“దొంగలున్నారు జాగ్రత్త” ట్రైలర్ రిలీజ్

సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ” దొంగలున్నారు జాగ్రత్త”. మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో.. తన రెండవ చిత్రం ” తెల్లవారితే గురువారం” సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ యంగ్ హీరో తాజాగా నటించిన చిత్రం ” దొంగలున్నారు జాగ్రత్త”. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సతీష్ త్రిపుర దర్శకత్వం వహించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక కారు దొంగతనానికి వెళ్లి అందులో చిక్కిపోవడం, దానిలో నుంచి బయటకు రావడానికి చేసిన సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమాా కనిపిస్తోంది.

కారులో నుండి హీరో ఎలా తప్పించుకుంటాడు అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అదే సమయంలో ఆ కారులో బాంబు ఫిక్స్ చేసి ఉందని.. అది మరి కాసేపట్లో పేలుతుందనే విషయం అతనికి తెలుస్తోంది. ఆ కారులో నుండి హీరో ఎలా బయటపడ్డాడో తెలియాలంటే సెప్టెంబర్ 23 వరకు ఆగాల్సిందే.