దత్ గారి అమ్మాయిల‌కు ‘ఏజెంట్’ సెట్ట‌య్యాడా?

-

స్వప్న సినిమా.. క్రియేటివ్ ప‌రంగా రొటీన్ కు డిఫ‌రెంట్ గా ఉన్న క‌థ‌లనే ఎంక‌రేజ్ చేస్తోంది. తాజాగా ఈ బడా సంస్థ‌లో న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఛాన్స్ అందుకున్నాడని స‌మాచారం.

అశ్వీనిద‌త్ కుమార్తెలు స్వ‌ప్న‌, ప్రియాంకద‌త్‌లు ఎవ‌డే..సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో నిర్మాత‌లుగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. వైజ‌యంతీ బ్యాన‌ర్ కి అనుబంధం సంస్థ‌గా స్వ‌ప్న సినిమా బ్యానర్‌ని ప్రారంభించి ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి సినిమా యావ‌రేజ్ గా ఆడింది. ఇలా అయితే లాభం లేద‌నుకున్న ద్వ‌యం డేరింగ్ స్టెప్ తో మ‌హాన‌టి సావిత్రి క‌థ‌కు వెండి తెర రూపం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా స‌క్సెస్ తో ఇండస్ర్టీ మొత్తం ద‌త్ డాట‌ర్ ల‌ని ఓ గొప్ప సినిమా నిర్మించారంటూ ఆకాశానికి ఎత్తేసింది. తండ్రికి త‌గ్గ త‌న‌యురాళ్లు అనిపించార‌ని సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవే కితాబిచ్చారు. అప్ప‌టి నుంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు నిర్మించాల‌ని టార్గెట్ గా సంస్థ ప‌నిచేస్తోంది.

క్రియేటివ్ ప‌రంగా రొటీన్ కు డిఫ‌రెంట్ గా ఉన్న క‌థ‌లనే ఎంక‌రేజ్ చేస్తోంది. తాజాగా ఈ బడా సంస్థ‌లో న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఛాన్స్ అందుకున్నాడని స‌మాచారం. ఇటీవ‌లే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌తో యంగ్ హీరోగా భారీ స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమా గా విడుద‌లైన పెద్ద విజ‌యం సాధించింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన సినిమా కావ‌డం…న‌వీన్ పెర్పామెన్స్ బెస్ట్ గా ఉండ‌టంతో న‌టుడిగా మంచి పేరొచ్చింది. దీంతో కుర్ర హీరో స్వ‌ప్న సినిమాస్ దృష్టిలో ప‌డ్డాడు. కొన్ని నెల‌లుగా స్వ‌ప్న బ్యాన‌ర్ లాక్ చేసిన క‌థ కోసం హీరో ఎవ‌రైతే బాగుంటుంద‌ని అన్వేష‌ణ చేస్తున్నారుట‌.

చాలా మంది హీరోల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ క‌థ‌కు యాప్ట్ అవ్వ‌క‌పోవ‌డంతో పెండింగ్లో పెట్టేసారుట‌. ఇప్పుడు ఆత్రేయ ఎంట్రీతో ఆ క‌థ‌నే సినిమా చేస్తున్నట్లు నిర్మాణ వ‌ర్గాల స‌న్నిహితుల నుంచి తెలిసింది. ఈ క‌థ ఓ ప్ర‌యోగం అని అంటున్నారు. ఇండియ‌న్ స్ర్కీన్ పైనే ఇప్ప‌టివ‌ర‌కూ రాని క‌థ‌ని స‌మాచారం. బ‌డ్జెట్ కూడా భారీగానే ఉంటుందిట‌. టెక్నిక‌ల్ గాను సినిమా రిచ్ గా ఉంటుందిట‌. ఓ కొత్త ద‌ర్శ‌కుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించారుట‌. ఆ పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డించ‌నున్నార‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news