ఆ ముద్దుల గురించే ఓ ఇంటర్వూలో… ఒక అమ్మాయి అబ్బాయి ఒకర్ని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నప్పుడు.. ఒకర్ని ఒకరు కొట్టుకోవడం.. ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదన్నాడు.
వివాదాస్పద విషయాల్లో వేలు పెట్టడం అక్కినేని కోడలు సమంతకు అప్పుడప్పుడు అలవాటు. ఏ విషయంపైనైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఎదుట వ్యక్తి ఎవరైనా ఆలోచించదు. తన మనసుకు అనిపించింది బయట పెట్టేస్తుంది. నాగచైగన్యతను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వైఖరి మరింత ఎక్కువైంది. తాజాగా సమంత కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా రెచ్చిపోయి నటించిన సంగతి తెలిసిందే. పెదవి ముద్దులే మళ్లీ సినిమాలో హైలైట్ అయ్యాయి.
ఆ ముద్దుల గురించే ఓ ఇంటర్వూలో… ఒక అమ్మాయి అబ్బాయి ఒకర్ని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నప్పుడు.. ఒకర్ని ఒకరు కొట్టుకోవడం.. ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదన్నాడు. దీనిపై సమంత ఈ వ్యాఖ్యలు చాలా అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఓ ఆంగ్ల మీడియా ట్విటర్లో అప్పుడేమో అర్జున్ రెడ్డి బాగుందన్నారు. ఇప్పుడు సందీప్ వ్యాఖ్యలు బాధగా ఉన్నాయం టున్నారు. మీరి రెండు నాల్కల ధోరణిలా ఉందంటూ పోస్ట్ చేసింది. దీనికి సమంత రిప్లై ఇచ్చింది. ఒక సినిమాను ఇష్టపడటం లేరు. ఒకరు చేసిన వ్యాఖ్యలతో విబేధించడం వేరు. రెండు పోల్చితే ఎల? . నాకు అర్జున్ రెడ్డి నచ్చింది. దానర్ధం ఇష్టం వచ్చినట్లుగా మనతో ఉన్నవారిపై చేయి చేసుకునే కాన్సెప్ట్ కూడా నాకు నచ్చిందని కాదు అని కౌంటర్ వేసింది.
దీంతో సందీప్ పై, ఆ ఆంగ్ల మీడియాకి పంచ్ పడినట్లు అయింది. ఇంకా సందీప్ సమంత కామెంట్ పై రిప్లై ఇవ్వలేదు. అతని రియాక్షన్ ఎలా ఉటుందా? అని అంతా ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు. సందీప్ కూడా డేరింగ్ అండ్ డ్యాషింగ్. సమంత అక్కినేని ఫ్యామిలీ కోడలు కదా?అనఇ ఊరుకునే టైప్ కాదు. ఎంతటి వారిపైనైనా తనదైన శైలిలో బధులిస్తాడు. ఇక కబీర్ సింగ్ ఇటీవల విడుదలైన 200 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. స్టిల్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా బాగా లేదు అని రాసిన క్రిటిక్స్ ని సందీప్ నిన్ననే ఉతికారేసాడు.