బుల్లితెర స్టార్ ప్ర‌భాకర్ మ‌రో మహిళతో ఎఫైర్, భార్య వార్నింగ్.! అంతా సెట్ రైట్.!

-

ప్రస్తుతం మన బుల్లి తెర వెండి తెర‌ని మించి పోతోంది. కొత్త , పాత న‌టుల‌తో వెలిగిపోతోంది. సినిమ‌3ల్లో రిటైర్ అయిన వారు సీరియల్ లో నటిస్తూ కెరియర్ ను సాఫీగా నెట్టుకొస్తున్నారు.  అలాగే కొంత మంది సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుతున్నారు. టివి ఛానెల్స్ లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుండి బుల్లితెర ద్వారా ఎంతో మంది ఫేమస్ అయిన వారు వున్నారు.వారిలో సీరియల్ నటీనటులు అందరూ ముద్దుగా బుల్లితెర సూపర్ స్టార్ గా పిలుచుకొనే  ప్రభాకర్ ఒకరు.

తాను మొదట్లో  టీవి ఛానెల్స్ లో అనేక పాపులర్ షోస్ కి క్రియేటివ్ హెడ్ గా పని చేశాడు. తర్వాత సీరియల్స్ లో  స్వయంగా నటిస్తూ దర్శకత్వం మరియు నిర్మాణం పనులు కూడా  చేస్తున్నారు.రీసెంట్ గా ప్రభాకర్ తన కొడుకును హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నామని మీడియాలో ప్రకటించారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో ప్రభాకర్ తన భార్యతో రిలేషన్షిప్ మరియు ఓ మహిళ తో  సంబంధం గురించి, తెలియని విషయాలను వెల్లడించాడు.

తాను నటించే రోజులలో  ఓ మహిళతో చాలా సన్నిహితంగా ఉండే వాడిని అని, అది మా మధ్య చాలా దూరం వరకు వెళ్ళిందని తెలిపాడు. తన ప్రేమ నుండి అస్సలు బయట పడలేక పోయానని చెప్పాడు. తాను ఆమెతో వుంటున్నానని తెలిసి తన భార్య చాలా ఏడ్చింది అని చెప్పాడు. తప్పు జరిగిపోయిందని  క్షమించమని చాలా ప్రాధేయ పడ్డానని చెప్పుకొచ్చారు. కాని తన భార్య మాత్రం ఆమెను వదిలేస్తేనే నీతో వుంటాను అని చెప్పిందని అన్నాడు.ఇక నుండి నీ కోసమే బతుకుతా అని చెప్పానని తెలిపాడు. తర్వాత మెల్లిగా ఆరిలేషన్ షిప్ నుండి బయటపడ్డానని తెలిపాడు. ప్రస్తుతం తాను హ్యాపీగా ఏవిధమైన గోల లేకుండా జీవిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

త‌న భార్య ఏడిస్తే త‌న‌కు క‌ష్టాలు వ‌స్తాయ‌ని, అది త‌న‌వ‌ల్ల ఏడిస్తే పెద్ద స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని, త‌న‌ను ఎప్పుడు ఏడ్పించ‌న‌ని చెప్పాడు. త‌ను న‌వ్వితే చాలా అంతా స‌వ్యంగా ఉంటుంద‌ని ఆమె సంతోస‌మే త‌న స‌క్స‌స్ అని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news