ఒకప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సోనాక్షి సిన్హా ప్రస్తుతం కెరియర్ లో చాలా వెనుకపడటమే కాకుండా స్పెషల్ ఈవెంట్ నిర్హ్వాకులకు హ్యాండ్ ఇస్తూ అపవాదాలు మూటకట్టుకుంటుంది. ఫ్యాషన్ ఇండియా అండ్ బ్యూటీస్ అవార్డ్ నిర్వాహకులు ఏకంగా సోనాక్షి మీద చీటింగ్ కేసు పెట్టడం ఆశ్చర్యంగా మారింది.
సినిమాలు తగ్గినా బాలీవుడ్ లో సోనాక్షి క్రేజ్ చూసి ఈవెంట్ నిర్వాహకౌలు ఆమెతో స్పెషల్ డ్యాన్స్ ప్లాన్ చేశారు. అందుకు ఆమెకు 3 లక్షల దాకా పారితోషికం ముందే పే చేశారట. తీరా ఈవెంట్ టైంకు వచ్చే సరికి ఆమె రాకుండా హ్యాండ్ ఇచ్చిందట. సోనాక్షి వస్తుందని టికెట్లు పెట్టి మరి కండక్ట్ చేసిన ప్రోగ్రాం కాస్త తుస్సుమన్నదట. షో నిర్వాహకులు ఈ విషయంపై సోనాక్షి మీద కేసు వేయడం జరిగింది.
కేవలం ఈ ఒక్క ఈవెంట్ కే కాదు గతంలో కూడా సోనాక్షి ఇలా చాలా ఈవెంట్స్ కు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టిందని వారు చెబుతున్నారు. దాదాపు 30 లక్షల దాకా ఆమె ఇలా వసూళు చేసిందట. మరి దీనిపై సోనాక్షి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.