అందుకే అంబరీష్ అంత్యక్రియలకు వెళ్లలేదు…!

-

Do you know why Ramya skipped Ambareesh funeral

కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ అంత్యక్రియలకు కన్నడ నటి రమ్య హాజరుకాలేదట. దీంతో ఆమెపై అంబరీష్ అభిమానులు భగ్గుమన్నారు. మండ్యా నుంచి రమ్య ఎంపీగా ఎన్నికైందంటే… దానికి కారణం అంబరీషే. అవసరమున్నప్పుడు అంబరీష్ తో స్నేహంగా ఉన్న రమ్య.. ఇప్పుడు ఆయన చనిపోతే.. కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకాదా అంటూ సోషల్ మీడియాలో ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆమె ఎందుకు అంత్యక్రియలకు హాజరు కాలేదో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తనకు ఓ అరుదైన వ్యాధి సోకిందట. దీంతో తన కాలికి గాయమైందట. దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నదట. అంబరీష్ చనిపోయిన సమయంలో రమ్య ఆసుపత్రిలోనే ఉన్నదట. అందుకే అంబరీష్ అంత్యక్రియలకు హాజరుకాలేకపోయినట్టు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తెలిపింది రమ్య. తన కాలికి అయిన గాయాన్ని ఫోటో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అంబరీష్ అభిమానులు కాస్త కూలయ్యేసరికి రమ్య ఊపిరి పీల్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news