రాజమౌళి – మహేష్ బాబు సినిమా విషయంలో ముందునుంచి అనుకున్నదే జరిగిందా ..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి సినిమా విషయం ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. వాస్తవంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో డా.కే.ఎల్.నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి దాదాపు మూడేళ్ళ క్రితమే కమిటయ్యారని తెలిసిందే. ఈ సినిమాని మహేష్ బాబు కెరీర్ లో 25 వ సినిమాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని అనుకున్నారు. కాని అది సాధ్యం కాలేదు.

 

ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయబోతున్నట్టు రీసెంట్ గా స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయం లో మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అయితే మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు.

 

అందుకు కారణం ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులని బట్టి ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికి రావడం కష్టమని తెలుస్తుంది. జనవరి 8 2021 లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేసి అదే సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ లో మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టాలని అందుకు తగ్గట్టుగానే తండ్రి విజయోంద్ర ప్రసాద్ కి కథ సిద్దం చేయమని చెప్పారట. అయితే ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్టు సమాచారం. అందుకే రాజమౌళి మహేష్ బాబు సినిమా లేటవుతుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కే సర్కారు వారి పాట సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి వెళ్ళబోతుందట.

 

2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కాని రాజమౌళి సినిమా లేటవడంతో సర్కారు వారి పాట తర్వాత మరో సినిమా చేసే సమయం ఉంటుందని ఆ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ముందు నుంచి అనుకున్నట్టుగా రాజమౌళి మహేష్ బాబు సినిమా 2022 లోనే అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version