హాలీవుడ్ సినిమాకు ఎఫ్-2 క్రేజ్..!

-

ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సూపర్ హిట్ కావడంతో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో హాలీవుడ్ సినిమా అల్లాదిన్ వారిద్దరి వాయిస్ ను వాడేసింది. అల్లాదిన్ తెలుగు వర్షన్ కోసం వెంకటేష్, వరుణ్ తేజ్ ల వాయిస్ లను వాడేశారు. అల్లాదిన్ సినిమాలో జెనెకు వెంకటేష్ డబ్బింగ్ చెప్పగా.. అల్లాదిన్ కు వరుణ్ తేజ్ వాయిస్ డబ్బింగ్ చెప్పాడు.

మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఎఫ్-2 తో హిట్టు కొట్టిన వెంకటేష్, వరుణ్ తేజ్ ఆ సినిమా సీక్వల్ కు తాము సిద్ధమని సినిమా సక్సెస్ మీట్ లో చెప్పారు. ప్రస్తుతం వెంకటేష్ వెంకీమామ సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా షూట్ లో ఉన్నాడు. ఎఫ్-2 డైరక్టర్ అనీల్ రావిపుడి మాత్రం సూపర్ స్టార్ మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news