సినీ ఇండస్ట్రీకి ఏడేళ్లపాటు దూరంగా ఉన్న ఫహాద్ ఫాసిల్..కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పుష్ప సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు ఫహాధ్ ఫాజిల్.. ఇక ఈయన ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈయనకు తెలుగులో వరుస అవకాశాలు రావడం గమనార్హం. ఇక ఇటీవల కమలహాసన్ తో విక్రమ్ సినిమాలో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఏకంగా కమలహాసన్ లాంటి గొప్ప నటుడు కూడా ఫహాధ్ ఫాజిల్ నటన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది.

ఇక ఈయన చూడడానికి చాలా సింపుల్ గా ఉండడంతో పలు క్రేజీ ప్రాజెక్టులను కూడా సంపాదించుకున్నాడు. అందుచేతనే పలు భాషలలో కూడా ఎప్పుడూ ఇతనిని సినిమాలలో చేర్చుకోవడానికి దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కమలహాసన్ కూడా ఈయన నటనను ఆకాశానికి ఎత్తివేయడంతో ప్రతి ఒక్కరు ఫహద్ ఫాజిల్ కు అభిమానులుగా మారిపోతున్నారు. నిజానికి ఈయన తండ్రి గొప్ప డైరెక్టర్ కావడంతో హీరో అవ్వడానికి చాలా ఆత్రుత పడ్డారు.ఇక అలా నటనలో ఏమాత్రం శిక్షణ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయనను చూసిన అభిమానులందరూ ఇతడు హీరోనా.. సినిమాలకు పనికిరాడు అంటూ ఎగతాళి చేశారట.. డిగ్రీ చదువుతున్న సమయంలో 19 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకున్న ఈయనాక్2002లో కైమేతూమ్ దురత్ అని చిత్రంలో నటించాడు. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పలు విమర్శలు రావడంతో పాటు బొమ్మలాగా ఉన్నాడని కామెంట్లు కూడా చేశారు.Fahad Fazil | Nazriya Nazim | Fahad Fazil Facebook | Nazriya Nazim Fahad Fazil Marriage | Fahad Fazil Latest News - Filmibeat

ఫహాధ్ ఫాజిల్ మాట్లాడుతూ.. అందులో తన తండ్రి తప్పు ఏమీలేదని.. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తాను అంచనాలను అందుకోలేకపోయారని నిజాయితీగా తెలిపాడు. ఆ తరువాత యాక్టింగ్ వదిలేసి ఎంఏ ఫిలాసఫీ చేయడానికి అమెరికా వెళ్లి అక్కడే ఏడు సంవత్సరాల పాటు ఉండిపోయి.. తిరిగి ఇండియాకి వచ్చి నటనలో శిక్షణ పూర్తి చేసుకొని మళ్ళి నటుడిగా మేకప్ వేసుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news