ప్రముఖ నిర్మాణ సంస్థలో హరీష్ శంకర్ సినిమా కన్‌ఫర్మ్ ..హీరో పవన్ కళ్యాణ్ …?

హరీష్ శంకర్ షాక్ తో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత మిరపకాయ్ తో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ఎన్నో సంచలనాలకు తెర తీసింది. దాంతో హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీ మొత్తం మార్మోగిపోయింది. అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు.

 

అయితే హరీష్ శంకర్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం, వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ సినిమాలను తెరకెక్కించి సక్సస్ లను అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ పవర్ స్టార్ తో సినిమాకి సన్నాహాలలో ఉన్నాడు. రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు కంప్లీటవచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమాని కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుంది.

అయితే ఈ రోజు ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ హరీష్ శంకర్ తో నెక్స్ట్ సినిమా ఉండబోతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంతక ముందు హరీష్ శంకర్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గద్దల కొండ గణేష్ తీసి హిట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో చేయబోయోది పవన్ కళ్యాణ్ తోనా అన్న ఆసక్తి మొదలైంది. మరి ఈ బ్యానర్ లో హరీష్ శంకర్ ఎవరితో సినిమా చేస్తాడో త్వరలో తెలియనుంది. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడు.