భారతీయ సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానంలో అశ్వగంధను ఎంతో పురాతన కాలంగా వాడుతున్నారు. అశ్వగంధ మొక్క ఆకులు, వేళ్లు, కాండం, పువ్వులు.. అన్నీ ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. అశ్వగంధ చూర్ణంతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఇప్పుడిదే అశ్వగంధ కరోనా మహమ్మారికి కట్టడి వేయగలదా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాలు మనకు కొండం ఆశను కల్పిస్తున్నాయి.
ఐఐటీ ఢిల్లీ, జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు అశ్వగంధపై తాజాగా పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో అందులోని పలు సమ్మేళనాలు కరోనా వైరస్ ప్రోటీన్‌ను ఎక్కువగా విస్తరించకుండా అడ్డుకుంటాయని వెల్లడైంది. దీంతో సైంటిస్టులు చేపట్టిన ప్రయోగాలకు బలం చేకూరినట్లయింది. ఈ క్రమంలో అశ్వగంధను కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే దివ్యౌషధంగా వారు భావిస్తున్నారు. ఇది సహజసిద్ధమైందే కాదు.. ధర కూడా తక్కువగా ఉంటుంది.. కనుక కరోనా మెడిసిస్‌ను చాలా తక్కువ ధరకే తయారు చేయవచ్చని వారు భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి సైంటిస్టులు చేసింది కేవలం ప్రయోగశాల స్టడీయే. ముందుగా దీన్ని జంతువులపై ప్రయోగించి.. అది సక్సెస్ అయితే హ్యూమన్ ట్రయల్స్‌కు వెళ్తారు. ఈ క్రమంలో సైంటిస్టులు కరోనాకు మెడిసిన్‌ను తయారు చేయగలమనే భావిస్తున్నారు. అదే నిజమైతే.. భారత్ కరోనా మందును తయారు చేసిన మొదటి దేశంగా నిలుస్తుంది.