విశాఖ, అరకు టూర్… ధర తక్కువే.. ఈ ప్రదేశాలన్నీ ఎంచక్కా చూడచ్చు..!..!

-

ఈ వేసవి లో మీరు కూడా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే దీన్ని మీరు చూడాల్సిందే. విశాఖపట్నం, అరకు టూర్ వెళ్లాలనుకునే వాళ్ళు ఈ బస్సు ప్రయాణం గురించి తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. శ్రీకాకుళం 1, 2 డిపోలకు చెందిన బస్సులు 2023 మే 27న అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు విశాఖపట్నం, అరకు టూర్ కవర్ చేస్తుంది. భీమునిపట్నం బీచ్, తిరుమల తిరుపతి దేవాలయం, కైలాసగిరి, అరకు తో పాటుగా ఈ బస్సు లో పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ హౌస్, బొర్రా గుహలు ని కూడా చూసి రావచ్చు.

ఈ ప్రదేశాలని మీరు చక్కగా చూసి రావచ్చు. ఏపీఎస్‌ఆర్‌టీసీ విహారయాత్ర కోసం స్పెషల్‌గా సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసింది. ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. బస్సు శ్రీకాకుళం బస్సు స్టేషన్‌లో ఉదయం 9.00 గంటలకు మొదలు అవ్వనుంది. మొదట భీమునిపట్నం బీచ్, కైలాసగిరి, తిరుపతి దేవస్థానం చూసి తర్వాత ఎస్ కోట మీదుగా అరుకు వెళ్ళాలి. రాత్రి కి అరకులో బస చేయాలి. అరుకులో లాడ్జింగ్, డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి.

రెండో రోజు చూస్తే.. ఉదయం 8 గంటలకు బయలుదేరి అరకులో పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ హౌస్, బొర్రా గుహల ని చూడచ్చు. సాయంత్రం 6.00 గంటలకు తిరిగి శ్రీకాకుళం స్టార్ట్ అవ్వాల్సి వుంది. ఈ టూర్ కోసం ఒక్కొక్కరు రూ.2500 చెల్లించాలి. గోపాలపురం బీచ్, చిలక సరస్సు కవర్ అయ్యే విధంగా ఇంకో టూర్ వుంది. బీచ్ చూసిన తర్వాత చిలక సరస్సులో గల ప్రసిద్ధ మహాకాళీ ఆలయాన్ని చూసి రావచ్చు. ఈ ప్యాకేజీకి అయితే ఒక్కరికి రూ.1500 .

Read more RELATED
Recommended to you

Latest news