సైరా సెట్ లో అగ్నిప్రమాదం.. భారీ ఆస్థి నష్టం..!

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా సెట్ ప్రాపర్టీ అగ్నికి బలైంది. కోకాపేటలోని చిరంజీవి ఫాం హౌజ్ లో వేసిన సెట్ ఎండ వేడి వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్నిప్రమాదం జరిగింది. అయితే సెట్ లో ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తుంది. అయితే ఆ సెట్ మొత్తం భారీ ఖర్చుతో నిర్మించబడింది. సెట్ దాదాపు నాశనమైందని తెలుస్తుంది.

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు పైగా పెట్టేస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నా సినిమా మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news