బిగ్ బాస్: సోహైల్ అడిగింది కరెక్టే.. హారిక అభిజిత్ ని అలా అనగలదా..?

నామినేషన్స్ లో హౌస్ మొత్తం గరం గరంగా మారిపోయింది. ఈ రోజు జరిగిన ఎపిసొడ్ లో హౌస్ మొత్తం వేడెక్కిపోయింది. ఎవరికి తోచిన విధంగా కామెంట్లు చేస్తూ ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. నామినేషన్స్ లో హారిక, సోహైల్ ల మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశంగా మారింది. వేస్టుగాడు, ఎవడూ దేకడు అని నాగార్జున గారి ముందు అన్నందుకు సోహైల్, హారికని నామినేట్ చేసాడు. ఈ విషయంలో వీరిద్దరికీ పెద్ద యుద్ధమే జరిగింది.

ఒకరినొకరు అరుచుకుంటూ హౌస్ అంతా గోల గోల చేసారు. నువ్వు అలా ఎందుకన్నావ్ అని సోహైల్ అంటే, అవి నా ఊతపదాలు అని హారిక చెప్పింది. ఐతే ఇక్కడ సోహైల్ ఒక కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. నామినేషన్స్ పూర్తిగా ముగిసిన తర్వాత ఆరియానాతో మాట్లాడుతూ, నన్ను అన్ని మాటలు అన్నది. వేస్టుగాడు, ఎవడూ దేకడు అన్నది కదా.. అలాంటి మాటలే అభిజిత్ ని అంటుందా? అభిజిత్ ని వేస్టుగాడు అనగలదా? అని అన్నాడు.

సోహైల్ అన్నది నిజమే కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి అభిజిత్ ని కూడా తన ఊతపదంతో పిలుస్తుందా అనేది శనివారం నాగార్జున గారి ముందే తెలియాలి. ఇక సోహైల్ ని నామినేట్ చేసిన అభిజిత్, నువ్వు నీ యవ్వ అనడం నచ్చలేదని చెప్పాడు. అది తన ఊతపదమని, ఇక్కడికి వచ్చామని చెప్పి, నీలాగా బ్రో అనుకుంటూ పిలవలేనని, నువ్వు హర్ట్ అయితే సారీ అని చెప్పాడు.

మొత్తానికి ఈ రోజు నామినేషన్స్ అన్నీ భాష చుట్టూనే తిరిగాయి. ఇదే విధంగా కొనసాగితే పెద్ద రచ్చ అయ్యే అవకాశం ఉంది. మరి దీనిమీద నాగార్జున గారు ఏమంటారనేది చాలామందిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న.