Sumanth:‘అహం రీబూట్’ ఫస్ట్ లుక్ రివీల్..అహం పక్కనపెట్టి సాయం చేస్తున్న సుమంత్!

-

అక్కినేని వారి కుటుంబం నుంచి వచ్చిన హీరో సుమంత్..గత కొంత కాలం నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల OTTలో విడుదలైన ‘మళ్లీ మొదలైంది’ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాడు. జీ5 ఓటీటీ ఒరిజినల్ గా వచ్చిన ఈ పిక్చర్ కు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా, కె.రాజశేఖర్‌రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

ఈ క్రమంలోనే సుమంత్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. తాజాగా తను నటిస్తున్న ‘అహాం రీబూట్’ పిక్చర్ ఫస్ట్ లుక్ ను సోమవారం RRR రైటర్ విజయేంద్రప్రసాద్ లాంచ్ చేశారు. ఈ మూవీని వాయుపుత్ర ఎంటర్ టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.

ఇక ఫస్ట్ లుక్ లో సుమంత్.. చాల కొత్త గెటప్ లో కనబడుతున్నాడు. హెల్ప్ మీ అనే అక్షరాలు సుమంత్ ఫోన్ పైన కనబడుతుండగా, అహం పక్కనబెట్టి సుమంత్ సాయం కోరే వారందరికీ సాయం చేస్తాడన్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది.

ఇక ఈ సినిమా స్టోరి, హీరో రోల్ విని తాను చాలా ఎగ్జైట్ అయ్యానని విజయేంద్రప్రసాద్ తెలిపారు. మూవీ యూనిట్ కు అభినందనలు చెప్పిన విజయేంద్రప్రసాద్ సినిమా చక్కటి విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news