‘ స‌రిలేరు నీకెవ్వ‌రు ‘ … రాముల‌మ్మ లుక్ ర‌చ్చ‌

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ర‌ష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ రిలీజ్ చేసిన యూనిట్ సభ్యులు దీపావళి కానుకగా ఈ రోజు విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి విజయశాంతి లుక్ ని తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

స్టైలిష్ లుక్ తో ఈ పోస్టర్ లో విజయశాంతి ఆకట్టుకుంటున్నారు. కూర్చీలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, ఏదో ఆలోచిస్తున్నట్టు ఆమె ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటిస్తుండటంతో… ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, ఈ చిత్రంలో విజయశాంతి పోషిస్తున్న పాత్ర ఏంటనేది ఇంత వరకు చిత్ర యూనిట్ సీక్రెట్ గానే ఉంచింది. సంక్రాంతి సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయశాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

సరిలేరు లో విజయశాంతి రోల్ ఏంటన్నది తెలియకపోయినా మహేష్ బాబుతో సమానంగా ఆమె పాత్ర ఉంటుందని కూడా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరి కొందరు విజయశాంతి మహేష్ కు అత్తగా కనిపిస్తారని చెబుతున్నారు. ఇక అనిల్ రావిపూడి మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఏదేమైనా 13 ఏళ్ల తర్వాత క వెండితెరపై రెండు ఇచ్చిన విజయశాంతి తన లుక్ తోనే ఆమెకు సరి లేరు ఎవరు అని ప్రూవ్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news