” బింబిసార” ఓటిటి స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జి5

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. టైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బింబిసార అనే రాజుగా కనిపించాడు.

ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ హక్కులను ” జి 5″ వారు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. కొత్తగా పెట్టుకున్న నిబంధనల ప్రకారం 50 రోజుల తర్వాత ఈ సినిమా ” జి 5″ ఓటీటి ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉందిి. కొత్త డైరెక్టర్ వశిష్ట రూపొందించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.