‘గాండీవధారి అర్జున’ ప్రీ-టీజర్‌ రిలీజ్.. హాలీవుడ్‌ రేంజ్​లో విజువల్స్

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆగస్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్​ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ వేరే లెవెల్​లో ఉంది. ఉత్కంఠ రేపుతున్న సీన్స్.. హాలీవుడ్​ను తలపిస్తున్న విజువల్స్​లో అద్దిరిపోయింది. గని, ఎఫ్3 సినిమాల ఫెయిల్యూర్​తో సతమతమవుతున్న వరుణ్​కు ఈ సినిమా ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.

వేగంగా వెళ్తున్న కారు.. వెనకాల ఉన్న డిక్కీలో గన్స్‌.. వాటిలోంచి ఒక మిస్సైల్‌ లాంటి గన్‌ తీసుకుని వరుణ్ ప్రత్యర్థులపై దాడి చేయడం.. ప్రీ టీజర్‌లో టీజర్‌ తాలుకూ రిఫరెన్స్‌లు పెట్టి విపరీతమైన అటెన్షన్‌ క్రియేట్‌ చేశాడు ప్రవీణ్‌ సత్తారు. ప్రీ టీజరే ఈ రేంజ్‌లో ఉంటే, టీజర్‌ ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news