రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి – అద్దంకి దయాకర్

-

రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి నిన్న ఉచిత కరెంట్‌ పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇక ఇదే విషయంపై ఓ ఛానల్‌ చర్చ లో కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ పాల్గొని..వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ గా మారింది.మరోవైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు నిరసనకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేతలు తిప్పికొట్టారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news