మైత్రి మేకర్స్ ఛాన్స్ అందుకున్న పరశురాం

-

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా స్టార్ సినిమాలతో మంచి లాభాలు సాధించిన మైత్రి మూవీ మేకర్స్ శ్రీమంతుడు సినిమా నుండి ప్రొడక్షన్ మొదలుపెట్టారు. శ్రీమంతుడు సూపర్ హిట్ ఆ తర్వాత జనతా గ్యారేజ్ కూడా హిట్ అయ్యింది. ఈ ఇయర్ రంగస్థలం కూడా మరో బ్లాక్ బస్టర్ నిర్మాతల ఖాతాలో పడ్డది. ఓ పక్క స్టార్స్ తో సినిమాలు చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ యువ దర్శకులతో కూడా సినిమాలు తీసేందుకు సిద్ధమైంది.

ఈమధ్యనే సాగర్ చంద్రతో ఒక సినిమా మొదలుపెట్టబోతున్న మైత్రి మూవీ మేకర్స్ గీతా గోవిందం డైరక్టర్ పరశురాం తో కూడా ఓ ఢీల్ సెట్ చేసుకున్నారట. మైత్రి చేతుల్లో పడితే ఖచ్చితంగా మినిమం గ్యారెంటీ హీరో వస్తాడు. శ్రీరస్తు శుభమస్తు తర్వాత పరశురాం చేసిన గీతా గోవిందం మరో 4 రోజుల్లో రిజల్ట్ తెలిసిపోద్ది. మైత్రి మేకర్స్ తో పరశురాం సినిమా దాదాపు ఫైనల్ అయ్యిందట.

ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరు.. అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది కాబట్టి ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తాయో ఏ క్రేజీ కాంబినేషం ఈ సినిమాకు సెట్ అవుతుందో వేచిచూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news