టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక ఆ తర్వాత వచ్చిన దేవదాస్ కాస్త నిరాశపరచింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక మరో క్రేజీ ఛాన్స్ అందుకుందట. అది కూడా మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించే ఛాన్స్ అందుకుందట.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్-2, అంతరిక్షం రెండు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. అంతరిక్షం ఈ నెల 21న వస్తుండగా.. ఎఫ్-2 సంక్రాంతికి రిలీజ్ అవనుంది. ఈ రెండు సినిమాలు ముగింపు దశకు రాగా తమిళ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ లో వరుణ్ తేజ్ నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో వరుణ్ తేజ్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తాడని తెలుస్తుంది.
ఈ మూవీలో రష్మిక ఛాన్స్ కొట్టేసిందట. జిగుర్తండాలో లక్ష్మీ మీనన్ నటించిన రోల్ కు రష్మిక సెలెక్ట్ అయ్యిందట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.