సుబ్రహ్మణ్యపురంలో రానా..?

సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో వస్తున్న సినిమా సుబ్రహ్మణ్యపురం. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబందించిన ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో సుమంత్ తో పాటు రానా కూడా ఉంటాడట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రానా కనిపించడు వినిపిస్తాడట.

సుబ్రహ్మణ్యపురం సినిమాకు రానా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడట. దానికి సంబందించి డైరక్టర్ సంతోష్ రానాతో దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రానా వాయిస్ ఓవర్స్ తోనే మొదలయ్యే ఈ మూవీ కీలక సన్నివేశాల్లో కూడా రానా వాయిస్ ఓవర్ ఉంటుందట. అంతేకాదు ఎండింగ్ లో కూడా రానా వాయిస్ ఓవర్ ఉంటుందట. మొత్తానికి భళ్లాలదేవ రానాని సుమంత్ అండ్ టీం బాగానే వాడినట్టు తెలుస్తుంది.

మళ్లీ రావా సినిమాతో ఫాంలోకి వచ్చిన సుమంత్ సుబ్రహ్మణ్యపురం సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యపురం ఊరు.. ఆ ఊళ్లోని గుడి చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.