టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెడితే.. చిరు-రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఘరానా మొగుడు’ గురించి సినీ అభిమానులందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీసు వద్ద రికార్డుల ఊచకోత కోసిన ఈ పిక్చర్..మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయింది.
‘ఘరానా మొగుడు’ చిత్రం విడుదలై 30 వసంతాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అలనాటి చిత్రవిశేషాల గురించి తెలుసుకుందాం. ‘గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత వచ్చిన ఈ పిక్చర్ ఆ రెండిటినీ మించిన విజయం సాధించి మెగా అభిమానులు ఆనందపడేలా చేసింది. చిరుకు ఇది 75వ చిత్రం కాగా, ఇది రీమేక్ ఫిల్మ్ కావడం గమనార్హం. తమిళ్ డైరెక్టర్ పి.వాసు స్టోరిని తెలుగు నేటివిటీకి తగ్గట్లు పరుచూరి బ్రదర్స్ మార్చి అందించగా, ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 1992 ఏప్రిల్ 9న విడుదలైన ఈ పిక్చర్ ఘన విజయం సాధించింది.
ఈ పిక్చర్ లో హీరోయిన్స్ గా నగ్మా, వాణి విశ్వనాథ్ నటించారు. నగ్మా-చిరుల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో ‘బంగారు కోడి పెట్ట’ సాంగ్ బాస్ చిరును.. డ్యాన్స్ గురుగా మార్చేసింది. తనలోని గ్రేస్ ప్లస్ డ్యాన్స్ మూమెంట్స్ చూపి జనాలను ఉర్రూతలూగించాడు చిరంజీవి. ఈ పాటను రామ్ చరణ్ ‘మగధీర’లో రీమేక్ చేయడం విశేషం.
ఎం.ఎం.కీరవాణి అందించిన స్వరాలు, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. ఈ చిత్ర వంద రోజుల సంబురాలు చేశారు మేకర్స్. దేవీ వర ప్రసాద్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. కార్మిక సంఘ నాయకుడిగా, ఫ్యాక్టరీ ఓనర్ అల్లుడిగా చిరంజీవి నటనకు జనాలు ఫిదా అయిపోయారు. రావు గోపాలరావు, కైకాల సత్యనారయణ, బ్రహ్మానందం, రమ ప్రభ, ఆహుతి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.