పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

-

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. అదేంటి అంటే మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తారట.. సిని హీరోగా క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న పవన్ రాజకీయ నాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు. జనసేన పార్టీ పెట్టి ఏపి ఎలక్షన్స్ లో ప్రభంజనం సృష్టించాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపేస్తారని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కాని త్వరలోనే పవన్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటాడని తెలుస్తుంది.

ఎలక్షన్స్ తర్వాత మళ్లీ పవన్ సినిమాలను కొనసాగిస్తాడట. అయితే అది ఎప్పుడు ఏంటన్నది మాత్రం ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుందట. పవర్ స్టార్ క్రేజ్ కు ఎప్పుడు సినిమాలు తీసినా సరే ఆ లెక్క వేరేలా ఉంటుంది. టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం తన ఫ్యాన్స్ కు శుభవార్తే. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ పవన్ కు అడ్వాన్స్ ఇచ్చారు. మరి దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news