సామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో రౌడీ హీరో సినిమా సెట్ లో..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇండస్ట్రీలోకి రాకముందు చిన్న చిన్న జువెలరీ షాప్ లలో పనిచేసేది. అక్కడక్కడ చిన్నచిన్న యాడ్స్ వస్తే అందులో కూడా నటించి పాకెట్ మనీ కోసం పనిచేసేది. అందుకే కష్టపడి పైకి వచ్చింది కాబట్టి తాను ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణీ అవుతున్న సమంత గత కొద్దిరోజుల క్రితం మయో సిటీస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయినా కూడా ఏమాత్రం వెనుకాడకుండా యశోద సినిమా డబ్బింగ్ కూడా హాస్పిటల్ బెడ్ పై నుంచి పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన సమంత చేతికి జపమాల ధరించి శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్ కి హాజరయ్యింది.

ఇక అప్పటినుంచి ఆమె కనిపించలేదు. శాకుంతలం సినిమా ఎలాగో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతోంది. కాబట్టి తన తదుపరి సినిమాల షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్న నేపథ్యంలో జనవరిలో షూటింగ్లో పాల్గొంటారని గతంలో సమంతా చెప్పింది. కానీ జనవరి నెల పూర్తి కాబోతున్నా.. ఇప్పటివరకు సమంతా చిత్రీకరణలో పాల్గొనలేదు సమంత. ఇప్పుడు మళ్ళీ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి నుండి సమంతా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించబోతుందట. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమె ఫిబ్రవరిలో 15 రోజులపాటు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ రెండు వారాల్లో విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి సమంత అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను మళ్లీ వెండితెరపై చూడవచ్చు అనే వారి ఆశ నెరవేరబోతున్నందుకు వారు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?