కుప్పంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు స్థానిక టిడిపి కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. టిడిపి హయాంలో బీసీలకు పథకాలు అందలేదని, కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని, తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఓ టిడిపి కార్యకర్త బహిరంగంగా మైక్ లో చెప్పడంతో అంత షాక్ అయ్యారు.
దీంతో వెంటనే మైక్ అందుకున్న లోకేష్, గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు బాగాలేదని, కుప్పం మున్సిపాలిటీని గెలిచిన వైసిపి నేతలు ఏం పీకారు అంటూ మండిపడ్డారు. కాగా, నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరిట చేస్తున్న పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తో కలిసి తారకరత్న కొద్దిసేపు జనాలతో మమేకం అవ్వడానికి నడవడం మొదలుపెట్టాడు. అలా కొద్దిసేపు వెళ్ళగానే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా .. అప్పటికే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం పదిమంది వైద్య బృందంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు.