గుడ్ న్యూస్… ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అదే…!

-

ఆర్ఆర్ఆర్… ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటుగా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రతీ ఒక్కరు కూడా ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే అందరూ ఆసక్తిగా చదువుతున్నారు. ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు.

ముందు జులై చివర్లో విడుదల అవుతుంది అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చింది చిత్ర యూనిట్. కొన్ని పనుల కారణంగా దసరాకు విడుదల చేస్తామని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సంక్రాంతి వరకు మార్చారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఎలా అయినా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు.

అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతుందని, షూటింగ్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. కాని తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ గ్యాప్ లో చేసుకుంటే మిగిలిన షూటింగ్ అప్పుడు చేయవచ్చని జక్కన్న భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news