షురూ అయిన `గోపిచంద్` 28వ‌ సినిమా..

-

సినిమా ఫలితాలపై సంబంధంలేకుండా.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మ్యాచో హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం ‘చాణక్య’ చిత్రం థియేటర్లలోకి రావ‌డానికి సిద్ధంగా ఉంది. పూర్తి యాక్ష‌న్ స్పై థిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. వాస్త‌వానికి గోపీచంద్ ఎప్పటికప్పుడు వినూత్నమైన కథాంశాలు, సరికొత్త పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక ముఖ్యంగా ఈ ఏడాది వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ప్ర‌స్తుతం చాణక్య విడుదలకు సిద్దంగా ఉన్న సమయంలోనే మరో రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ‘గౌతమ్‌నందా’తో నిరుత్సాహపరిచినప్పటికీ ఈ సారి బలమైన స్క్రిప్ట్‌తో రావడంతో సంపత్‌ నందికి ఈ యాక్షన్‌ హీరో‌ మరోసారి అవకాశం ఇచ్చాడు.

ప్ర‌స్తుతం గోపిచంద్ 28వ సినిమాగా ప‌ట్టాలెక్కింది. ఇక ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తొలి క్లాప్‌ కొట్టడంతో షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ “ప్రొడక్షన్ నెం.3” గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో రెండో సారి రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version