Gopichand Next Movie Title : “భీమా”గా రాబోతున్న గోపీచంద్

-

ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలివలపు సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత విలన్ గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆ తర్వాత యజ్ఞం సినిమాలో హీరోగా నటించి సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమా హిట్ కావడంతో హీరోగా గోపీచంద్ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే, ఇవాళ హీరో గోపీచంద్‌ పుట్టిన రోజు. ఈ తరుణంలో కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు గోపిచంద్‌. గోపీచంద్ 31వ సినిమాకు ‘భీమా’ అనే టైటిల్ నీ ప్రకటించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో KK రాధా మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా మరింత మాస్ గా ఉండబోతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా గోపీచంద్ హిట్ కొడతాడేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. కేజిఎఫ్ సినిమాకు సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news