చిప్స్, అప్పడాలు మెత్తగా అయిపోయాయా..? పారేయద్దు.. ఇలా చెయ్యండి బాగుంటాయి..!

-

వంటింట్లో రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా ఆహార పదార్థాలు పాడైపోవడం చీమలు పట్టడం ఇలా ఏదో ఒకటి… అయితే వంటింట్లో ఉండే సమస్యలకే మనం సులభంగా చెక్ పెట్టచ్చు. ఎక్కువగా మనకి ఈ సమస్య కలుగుతూ ఉంటాయి. ఈ సమస్యల నుండి ఎలా బయటపడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… చాలా మంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినడం మానేస్తూ ఉంటారు కాకరలో చేదు తగ్గాలంటే ఇలా చేయండి. ఇలా చేసి కాకరకాయను వండుకుంటే కచ్చితంగా కాకరకాయ రుచిగా ఉంటుంది చేదు మొత్తం తగ్గుతుంది.

కాకరకాయ వండేటప్పుడు కొన్ని సోంపు గింజలు బెల్లం వేస్తే చేదు మొత్తం తగ్గుతుంది. కూర చాలా టేస్టీగా వస్తుంది. అలానే ఒక్కొక్క సారి అప్పడాలు మెత్తగా అయిపోతూ ఉంటాయి అప్పడాలు మెత్తపడిపోయినట్లయితే ఒక సారి ఎండలో పెట్టండి అప్పుడు బాగుంటాయి. అప్పడాలు నూనె లాగకుండా ఉండాలంటే కూడా ఎండ లో పెట్టండి. గోధుమపిండి చిప్స్ చేసేటప్పుడు చిప్స్ కరకరలాడుతూ రావాలంటే గోధుమ పిండి తో చిప్స్ చేసే ముందు బంగాళదుంపల్ని ఉడికించి అందులో వేయండి అప్పుడు చిప్స్ కరకరలాడుతూ వస్తాయి.

బెండకాయలు ఫ్రిజ్లో పెట్టినా కూడా వాడిపోతూ వుంటుంటే బెండకాయలను తాజాగా ఉంచుకోవడానికి బెండకాయ రెండు వైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిజ్లో పెట్టండి అప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. వెల్లుల్లిపాయలు నిల్వ ఉండాలంటే వెల్లుల్లిపాయలతో కలిపి బంగాళదుంపల్ని పెట్టండి అప్పుడు ఎప్పుడూ తాజాగానే ఉంటాయి. పసుపు నిల్వ ఉండాలంటే కొంచెం ఎండు మిరపకాయలు రాళ్ల ఉప్పు వేసి ఉంచండి అప్పుడు కచ్చితంగా పసుపు ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో డబ్బులు ఆదా చేసుకోవచ్చు అనవసరంగా డబ్బులు వృధా అయిపోవు.

Read more RELATED
Recommended to you

Latest news