`సీటీమార్‌`గా రాబోతున్న యాక్షన్ హీరో గోపీచంద్‌

-

యాక్షన్ హీరో గోపీచంద్ కొంతకాలంగా సక్సెస్ లేక బాగా వెనకబడిపోయారు. ఒకప్పుడు నిర్మాతల హీరోగా ఉన్న గోపీచంద్ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది. గడిచిన మూడేళ్లలో వరుసగా ఆరు డిజాస్టర్లను గోపీచంద్ అందించారు. ‘లౌఖ్యం’ తర్వాత గోపీచంద్ హిట్టు కొట్టింతే లేదు. ఇక తాజాగా గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ కి మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో సెంటిమెంట్ వుంది. తన సినిమా టైటిల్ సున్నాతో పూర్తయ్యేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ‘లక్ష్యం’.. ‘లౌక్యం’.. ‘యజ్ఞం’ఇలా ఆయన సినిమాలు సున్నాతో పూర్తవుతుంటాయి.

అయితే ఈ మధ్య కాలంలో ఆయన సెంటిమెంట్ పనిచేయడం లేదు. చేసిన ప్రతి సినిమా పరాజయాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రానికి ‘సీటీమార్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేస్తూ తాజా పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో గోపీచంద్ రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. అలాగే బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. యు టర్న్ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news