ప్రేమ అయినా పెళ్లి అయినా బంధాలను కలిపి ఉంచే మార్గం మాత్రం నమ్మకమే! ఇరువురి మధ్య బంధం సుదృఢం అయ్యేందుకు అదే ప్రధాన భూమిక.ప్రేరణ కూడా! దేవుడు ఇచ్చిన ఆజ్ఞానుసారం పెళ్లిళ్లు జరుగుతాయి అంటారు.ఆ మాటకు అనుగుణంగా దేవదేవుని ఆశీస్సులతో ఒక్కటైన స్టార్ పెయిర్ మహేశ్ బాబు – నమ్రతాశిరోద్కర్ ముచ్చటగా మూడుముళ్ల బంధంలో, ఏడడుగుల అనుబంధంలో ఇమిడిపోయి,పరస్పరం ఒకరి ఆనందాలకు మరొకరు కారణం అవుతున్నారు. ఒకరి గెలుపులో మరొకరు ఉంటున్నారు. ఒకరి ఎదుగుదలకు మరొకరు సంపూర్ణంగా కారణం అవుతున్నారు.
ఇవాళ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మరియు నమత్రా శిరోద్కర్..ఆ జంటకు శుభాకాంక్షలు. 2000లో పుట్టిన ప్రేమ ఇరవై రెండేళ్లుగా కొనసాగుతోంది.2005,ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు. వంశీ సినిమా షూట్లో ఉన్నప్పుడు నమ్రతా ఆయనకు పరిచయం అయ్యారు. అంజి సినిమాలో నమ్రతా నటించారు.మెగాస్టార్ చిరు సరసన అభినయించి,ఆయన అభినందనలు అందుకున్నారు.
టక్కరిదొంగ సినిమాలోనూ మహేశ్ సరసన నటించారు.అటుపై చేసిన ఈ సినిమాతో ఆమె వ్యక్తిగత జీవితం పూర్తిగా మారిపోయింది.
ఆ వేళ పరిచయం అయిన మహేశ్ బాబును ముంబయిలో ఓ హోటల్ లో కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ బంధం హాయిగా సాగుతోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.గౌతమ్ కృష్ణ,సితార.
ఈ మాజీ మిస్ ఇండియాతో సాగించిన ప్రేమాయణం కాస్త నాన్న ఘట్టమనేని కృష్ణ ఆశీస్సులతో పెళ్లి దిశగా అడుగులు వేసి,ఆ బంధం ఇప్పటికీ అపురూప బంధగా కొనసాగుతోంది. ఆదర్శం గా నిలుస్తోంది.వివాహం తరువాత నమ్రతా సినిమాలకు గుడ్ బై చెప్పేశారు .తరువాత మహేశ్ బాబు కు పర్సనల్ స్టైలిస్ట్ గా ఖలేజా సినిమాకు పనిచేశారు.
ఇప్పుడు మహేశ్ బాబు ప్రారంభించిన ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ వ్యవహారాలు కూడా ఆమెనే చూసుకుంటున్నారు.అటు సినీ నిర్మాణంలోనూ ఇటు మహేశ్ కాల్షీట్ల వ్యవహారంలోనూ నమ్రత ఇవాళ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వైవాహిక బంధానికి ఉన్న గొప్పదనం నిర్వచనం చెబుతూ అన్యోన్యతకు ఆనవాలుగా నిలుస్తున్నారు.