ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని కృష్ణ మురళి, ఆర్. నారాయణమూర్తి కలిశారు. ఇక ఈ సందర్భంగా 14 డిమాండ్లను సీఎం జగన్ ముందు ఉంచారు టాలీవుడ్ ప్రముఖులు.
ఆమోద యోగ్యమైన టికెట్ల ధరలు, టిక్కెట్ల విక్రయాల్లో పారదర్శకత, ప్రభుత్వ ప్రదేశాల్లో అది లేకుండా సినిమా షూటింగులు, తక్కువ బడ్జెట్ చిత్రాలకు 5 షోలు, ఏడాదిలో 15 వారాలు చిన్న సినిమాల ప్రదర్శన, చిన్న చిన్న షరతులతో మినీ థియేటర్లకు అనుమతి, టాలీవుడ్ పరిశ్రమ కు ప్రత్యేక హోదా, ఆన్ లైన్ టికెటింగ్ మరియు టిక్కెట్ల విక్రయాల్లో పారదర్శకత, నిర్మాతలకు టెన్షన్, సినిమా వల్ల భారీగా నష్టపోయిన నిర్మాతలకు ఆర్థిక సహాయం, ఎంపిక చేసిన తెలుగు చిత్రాలకు నంది అవార్డులు, నిర్మాతలు దర్శకులు కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం భూముల కేటాయింపు, షూటింగ్ లో పనిచేసే కార్మికులకు నిర్మాతలు కార్మిక చట్టం అమలు చేయాలి, స్టూడియోల నిర్మాణాలకు భూముల కేటాయింపు ఇలాంటి డిమాండ్లను సీఎం జగన్ ముందు ఉంచారు టాలీవుడ్ ప్రముఖులు. అయితే దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.