PAWANKALYAN : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే… వకీల్‌ సాబ్‌ హిట్‌ తో జోష్‌ మీదున్న పవన్‌..వరుసగా మూడు సినిమాలను లైన్‌ లో పెట్టాడు. హిస్టారికల్ ఫిక్షన్ తరహాలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ముందు నుండి రకరకాల పేర్లు వినిపించాయి. చివరీ సినిమా యూనిట్ సినిమా పేరును ప్రకటించింది… అదే హరిహర వీరమల్లు.

ఇందులో పవన్ ఒక యోధుడిలా కనిపించారు. ఇక ఇటీవలే నిధి అగర్వాల్‌ ఫస్ట్‌ లుక్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. అయితే.. ఇది ఇలా ఉండగా…తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో హరిహర వీరమల్లు నుంచి ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ పవర్ ఫుల్ గా కనిపిస్తుండగా.. ఈ సినిమా డేట్ ను పోస్టర్ ద్వారా వెల్లడించింది చిత్ర బృందం. ఈ సినిమా ను వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ 29 వ తేదీ 2022 లో ఈ సినిమా విడుదల కానుంది.  ఇక పోస్టర్ తో ఈ సినిమా పై మరిన్ని అంచనాలను పెరిగిపోయాయి. కాగా.. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news