అలర్ట్ : ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కౌన్సెలింగ్‌ రీ షెడ్యూల్..

తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు సంబంధించిన… వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు తెలంగాణ విద్యాశాఖ అధికారులు. 18న ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ కేటాయింపులు జరగనున్నాయి.

ముందుగా ప్రకటించిన కాల పట్టిక ప్రకారం ఈ నెల 4 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలయి 13 వ తేదీతో ముగియాలి ఉంది. మరోవైపు ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్ యథాతథంగానే జరగనుంది. ఈనెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అలాగే కళాశాలల గుర్తిం పు ప్రక్రియ జాప్యం తో షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇటీవలే తెలంగాణ ఎం సెట్ పరీక్షల ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే.