టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన హరీష్ శంకర్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ ఎదో ఒక పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉండే ఆయన తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఒక పోస్ట్ చేశారు. పబ్లిక్ ఇబ్బంది పడుతున్న విషయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, ఆ ఇబ్బంది ఎవరి ద్వారా వచ్చిందో వారికి లింక్ చేసే విషయంలో హరీష్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఆయన తన తోచిన విధంగా రియాక్ట్ అవుతూనే ఉన్నారు. మంచి విషయాలను షేర్ చేస్తూనే ఉన్నారు. ఇతరులు ఎవరైనా మంచి విషయాన్ని పోస్ట్ చేస్తే దానిని రీ ట్వీట్ చేస్తున్న ఆయన తాజాగా వాట్సప్‌లో ఫార్వర్డ్ అవుతున్న ఓ ‘చైనా’ కవితను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
‘చైనా’ పురాణంలా ఉన్న ఈ కవితలో మంచి మెసేజ్ కూడా ఉండటం తో ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ చైనా కవిత ఎలా ఉంటుందో తెలుసా.
ఇటునుం‘‘ *చైనా* ’’
అటునుం *‘‘చైనా’’*
ఎటునుం *‘‘చైనా’’*
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం *‘‘చైనా’’* జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం *‘‘చైనా’’* పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం *‘‘చైనా’’* చెబుదాం.
వారికి కాస్త మం *‘‘చైనా’’* చేద్దాం
అంతకు మిం *‘‘చైనా’’* సాధిద్దాం.. అంటూ హరీష్ పోస్ట్ చేసిన ఈ ‘చైనా’ పురాణంపై నెటిజన్లు తెగ ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ విధించడం తో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బయటకురాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండడం తో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ లాక్ డౌన్ పీరియడ్ ను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలి అంటూ ఆయన పిలుపు నిచ్చారు.