ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో ధనుష్ మరో సినిమా…!

-

తక్కువ టైం లోనే స్టార్ హీరోగా ఎదిగిన తమిళ హీరో ధనుష్ కి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా తన మామ రజినికాంత్ ఫాలోయింగ్ సహకారంతో ధనుష్ కి ఫాన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. క్లాస్, మాస్ ఆడియన్స్ ఇద్దరినీ ఆకట్టుకునే సత్తా ధనుష్ సొంతం. దీనితో అగ్ర దర్శకులు కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు.

అయితే మనోడి కన్ను బాలివుడ్ మీద పడింది. 2013 లో బాలివుడ్ లో రంజనా అనే సినిమా చేసాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. సోనం కపూర్ తో ఈ సినిమా చేయగా అప్పట్లో ఈ సినిమా పాటలు మంచి హిట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత అమితాబ్ తో కలిసి షమితాబ్ అనే సినిమాలో కనిపించినా అది కూడా ఆకట్టుకోలేదు.

ఇప్పుడు మళ్ళీ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అతను ఒక సినిమా చేస్తున్నాడు. ‘అత్రంగి రే’ అనే టైటిల్‌తో హిమాన్షు శ‌ర్మ కథ అందించిన ఈ సినిమా మార్చి 1నుంచి షూటింగ్ కి వెళ్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ధనుష్, సారా అలీ ఖాన్ నటిస్తుండగా, బాలివుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోని సారా ఆలీఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news