చైనాలో కరోనావైరస్ అక్కడి ప్రజలను తీవ్రంగా భయపెడుతుంది. ఇక వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. దీనితో అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. ఎలా అయినా సరే ఈ వ్యాధిని అడ్డుకోవడానికి గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గాలితో పాటుగా ప్రయాణం చేస్తున్న ఈ వైరస్ ఈ నాలుగు రోజుల్లోనే నాలుగు వేల మందికి సోకింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపధ్యంలో ప్రముఖ వ్యాపార సంస్థలు దీనిపై పోరాటానికి మేము సిద్దం అంటున్నాయి. ఇందుకోసం తమ వంతు సాయం అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కరోనాపై పోరాటం చేస్తున్న చైనా ప్రభుత్వానికి తన వంతు సాయంగా ప్రముఖ వ్యాపారదిగ్గజం, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా రూ.14.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) విరాళంగా ప్రకటించారు. ఆయన బాటలోనే మరికొందరు పారిశ్రామిక వేత్తలు నడుస్తున్నారు.
టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ అధినేత ‘పోని మా’ సైతం 300 మిలియన్ యువాన్లు (రూ.309 కోట్లు) విలువైన వస్తువులతో పాటు మ్యాపింగ్, డేటా సర్వీసులను తమ ప్రభుత్వానికి అందిస్తున్నారు. దీదీ చుక్సింగ్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ తమ వాహనాల ద్వారా మెడికల్ వర్కర్స్, పేషెంట్లకు ఉచిత రవాణా సహాయం అందిస్తుంది. డైడు, టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ వంటి కంపెనీలు సైతం తమ వంతు సాయం అందిస్తున్నాయి.