ఇప్పుడు బాలీవుడ్ లో భారత క్రికెటర్ల బయోపిక్ ల సందడి నెలకొంది. వరుసగా ఒక్కో క్రికెటర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు, మూడు సినిమాలు ఇలాగే వచ్చి ప్రేక్షకులను ఎంతో అలరించాయి కూడా. సచిన్, ధోని సినిమాలు మంచి ఆదరణ పొందాయి. వీటికి భారీ మార్కెట్ కూడా ఉన్న నేపధ్యంలో దర్శక నిర్మాతలు వీటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా రణవీర్ సింగ్ హీరోగా, 83 అనే బయోపిక్ వస్తుంది. టీం ఇండియా తొలి ప్రపంచకప్ హీరో కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షల ముందుకి వస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడు మరో బయోపిక్ కి రంగం సిద్దమైంది. టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
ఈ సినిమాలో గంగూలీ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు అనే టాక్ వినపడుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాకి సంబంధించి గంగూలీ, హృతిక్ రోషన్‌లతో చర్చించినట్లు తెలుస్తోంది. గంగూలీ కూడా దీనిపై ఆసక్తి చూపించాడు అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి అంటే కొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందే.