షాక్: హీరో జీవా కు రోడ్డు ప్రమాదం..!

-

కోలీవుడ్ హీరో జీవా తాజాగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు రోడ్డు మధ్య లోని బారికేడ్ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్టు సమాచారం. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ ను  తప్పించబోయేందుకు  ప్రయత్నించగా..  ఈ ఘటన చోటు చేసుకుంది.

జీవా తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. జీవా తెలుగులో రంగం సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత డైరెక్టర్ మహి వి రాఘవ్  తెరకెక్కించిన యాత్ర2 లో జగన్ పాత్రలో జీవా నటించి శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాదు.. 1983లో ప్రపంచకప్ నేపథ్యంలో బాలీవుడ్ లో తెరకెక్కించిన మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో జీవా నటించారు. ప్రస్తుతం కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్నారు జీవా. 

Read more RELATED
Recommended to you

Latest news