తనయుడి విజయం చూసి మురిసిపోతున్న మాధవన్..ప్రముఖుల అభినందన

కోలీవుడ్ స్టార్ హీరో మాధ‌వ‌న్ ప్రస్తుతం పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు చూసిన మాధవన్..ఇప్పుడు అంతకు మించిన సంతోషం ఎక్స్‌పీరియెన్స్ చేస్తు్న్నాడు. తన తనయుడు ఈ సంతోషానికి కారణమయ్యాడు. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ ఏం చేశాడంటే..

స్విమ్మింగ్ పోటీల్లో ఇండియాకు సిల్వర్ మెడ‌ల్ సాధించాడు. కోపెన్ హాగ‌న్ లో జ‌రిగిన‌ డానిష్ ఓపెన్ 2022 పోటీల్లో 1,500 మీ ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో ఈ పతకం గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో మాధవన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులు, ప్రపంచంతో పంచుకున్నారు.త‌న తనయుడు భార‌త‌దేశం గ‌ర్వించేలా చేశాడ‌ని ఉబ్బి తబ్బిబ్బయ్యారు మాధవన్.

గతంలో స్పోర్ట్స్ డ్రామా అయిన బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేసిన మాధవన్..తన తనయుడు ఇప్పుడు రియల్ గా దేశం కోసం గేమ్ ఆడి పతకం సాధించడం పట్ల సంతోషపడుతున్నట్లున్నారు. హీరో మాధవన్ తనయుడు పతకం గెలిచాడన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు హీరో మాధవన్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ చాంపియన్ వేదాంత్ ను ప్రశంసిస్తు్న్నారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్..ట్వీట్ చేయగా, ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, మాధవన్ అభిమానులు శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు.