హీరో రాజ్ తరుణ్ అరెస్ట్.. కేసులో కీలక మలుపు ఇదే..!!

-

రెండు రోజుల క్రితం నార్సింగ్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో హీరో రాజ్ తరుణ్ చేసిన కారు ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో తనకి ఏమీ కాలేదని , సీటు బెల్టు పెట్టుకోవడం వలన తాను ప్రాణాపాయం నుంచీ బయట పడ్డానని, అందుకే అందరూ సీటు బెల్టు పెట్టుకొండి అంటూ సినిమాలో డైలాగులు చెప్పినట్టు చెప్పేశాడు.అక్కడి వరకూ అంతా బాగానే ఉంది.కానీ ఈ యాక్సిడెంట్ విషయంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈరోజు రాజ్ తరుణ్ అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ మీడియాకి తెలిపారు.

రాజ్ తరుణ్ ని 279,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. కారు ప్రమాదంపై రాజ్ తరుణ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని , 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని ఆయన డీసీపీ మీడియాకి తెలిపారు. అంతేకాదు రాజా రవీంద్ర ని కార్తీక్ అనే వ్యక్తి 5 లక్షలు ఇవ్వాలని అడిగినట్టుగా ఫిర్యాదు అందిందని, ఈ ఫిర్యాదు రాజా రవీంద్ర నేరుగా వచ్చిన మాకు ఇచ్చారని. ఈ ఫిర్యాదు పై కూడా కేసు నమోదు చేశామని డీసీపీ తెలిపారు.

అయితే తనతో రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర డబ్బులని ఎరగా చూపి బేరసారాలు చేశాడని కార్తీక్ ఆరోపించాడు. అందుకు తగ్గ ఆడియో కూడా కార్తీక్ వద్ద ఉందని అన్నాడు. వీడియోలు ఇవ్వాలని అతడిని రాజా రవీంద్ర బెదిరించాడని కార్తీక్ తెలిపాడు. ఈ వివాదం కాస్తా ముదిరింది. రాజ్ తరుణ్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అంటున్న కార్తీక్ ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పాడు..

Read more RELATED
Recommended to you

Latest news