మహిళను ఢీ కొన్న హీరో కారు.. హీరోకి గాయాలు మహిళ మృతి

-

రోడ్డు ప్రమాదాల గురించి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా సరే రోజు ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై బాధ్యతగా ఉండాల్సిన సెలబ్రిటీస్ కూడా ఈమధ్య రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఈమధ్యనే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలోనే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ నటుడు, నువ్వు తోపురా సినిమా హీరో సుధాకర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

అతను ఏ చెట్టుకో, భారీ వాహనానికో గుద్దలేదు రోడ్డు మీద వెళ్తున్న మహిళను ఢీ కొట్టడం జరిగింది. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందిందట. హైదరాబాద్ నుండి గుంటూరుకి నువ్వు తోపురా సినిమా ప్రమోషన్స్ కు వెళ్తున్న సుధాకర్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈ యాకిడెంట్ జరిగిందట. మే 3న నువ్వుతోపురా సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news