విద్యార్థుల సమావేశంలో రాజకీయాలపై హీరో విజయ్ సెటైర్లు విసిరారు. పదో తరగతి మరియు 12వ తరగతి టాపర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు విజయ్. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు హీరో విజయ్. మీరే కాబోయే ఓటర్లు…మీరే మంచి మంచి లీడర్లను రాబోయే కాలంలో ఎన్నుకోబోతున్నారన్నారు.
మన కన్నుతో మనమే గుచ్చికున్నట్లుంది ఇప్పుడు రాజకీయాల పరిస్థితి ….డబ్బు తీసుకుని ఓటు వేయడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒక ఓటు వెయ్యి రూపాయలు లెక్కన లక్షన్నర మందికి 15 కోట్లు ఖర్చుపెడుతున్నాడంటే దాని ముందు ఎంత సంపాదించి ఉంటాడు…చిన్న కామన్ సెన్స్ తో ఆలోచించండని కోరారు. ఇవన్నీ మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పాఠం రూపంలో చెప్పాలని కోరుకుంటున్న ..మీరు మీ తల్లిదండ్రులు వెళ్ళి చెప్పండి…. అమ్మ,నాన్న డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి అని అడగందన్నారు హీరో విజయ్. మీరందరూ వచ్చే ఎన్నికలలో తొలిసారి గా ఓటు వేయబోతున్నారన్నారు.