హైదరాబాద్ మ్యూజియం లో ఈజిప్టు మమ్మీ..!

-

ఈజిప్ట్ మమ్మీ ల గురించి మీరు విని ఉంటారు అయితే ఈజిప్టియన్ మమ్మీ లని చూడాలంటే మీరు హైదరాబాదులో కేవలం 10 రూపాయలకే ఈజిప్టియన్ మమ్మీ ని చూడొచ్చు అవును మీరు విన్నది నిజమే పది రూపాయలు చెల్లించి హైదరాబాదు లో మమ్మీని చూడొచ్చు సౌత్ ఇండియాలో ఇక్కడ ఒక్క చోట మాత్రమే మీరు మమ్మీని చూడడానికి అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లి పోదాం..

తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి మొదటి ఫ్లోర్ లోనే మమ్మీ ని చూడొచ్చు. అయితే రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం చూసినట్లయితే ఈ మహిళ 1700 ఏళ్ల నాటిది ఈజిప్ట్ ని రోమన్ ఎంపైర్ రూల్ చేస్తున్నప్పుడు క్రిస్టియానిటీ అక్కడ బాగా పెరిగింది ఆమెకి పేరు లేదు. ఆమె 30 నుండి 50 ఏళ్ల వయసు అప్పుడే ఆమె చనిపోయింది భయంకరమైన డెంటల్ సమస్యతో ఆమె చనిపోయింది.

ఆమె పళ్ళు కూడా మిస్ అయ్యాయి చాలామంది ఈజిప్టు లో వారు ఎలా బాధపడ్డారో ఈమె కూడా అదే విధంగా బాధపడే చనిపోయింది. స్కాన్ ప్రకారం చూసుకున్నట్లయితే శవాన్ని కూలిపోకుండా కాపాడే ప్రక్రియ లో పెరిమియం వద్ద చిన్న రంత్రాన్ని ఏర్పాటు చేసి ఆమె యొక్క అవయవాలను తీసేసారు. ఇంటస్టైన్స్, పొట్ట, లివర్, గుండె ని కూడా తొలగించారు కానీ ఆమె బ్రెయిన్ ఇంకా ఉంది ఆమెని శవపేటికలో ఉంచి అక్కడ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news