BREAKING : రేపటి నుంచి వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు ప్రారంభo కానున్నాయి. ఇండియాలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం రేపటి నుంచి జింబాబ్వే క్వాలిఫైయర్ మ్యాచులు జరగనున్నాయి. వరల్డ్ కప్ కి అర్హత సాధించేందుకు 10జట్లు పోటీ పడనున్నాయి.
ఇందులో టాప్-2 జట్లకు మాత్రమే వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో జింబాబ్వే, వెస్టిండీస్, నెదర్లాండ్స్, నేపాల్, USA ఉండగా… గ్రూప్-Bలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, UAE ఉన్నాయి.