రీమేక్ సినిమాల‌నే న‌మ్ముకుంటున్న హీరోలు.. ఎవ‌రెవ‌రంటే?

-

వ‌రుస రీమేక్‌ల‌తో తెలుగు ఇండ‌స్ట్రీ బిజీగా మారిపోయింది. చిన్న హీరోలే కాదు ఇప్పుడు పెద్ద హీరోలు కూడా సేఫ్ జోన్‌ను వెతుక్కుంటున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే హిట్ సినిమాల‌ను రీమేక్ చేసే ప‌నిలో ప‌డ్డారు మ‌న స్టార్లు. మ‌రి మ‌న ద‌గ్గ‌ర ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్లు లేరా అంటే ఉన్నారు. అయినా స‌రే రీమేక్‌ల‌తో ఖ‌చ్చిత‌మైన హిట్ వ‌స్తుంద‌ని మ‌న హీరోల న‌మ్మ‌కం.

 

లాంగ్ గ్యాప్ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ కూడా రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. చాలామంది హీరోలు వ‌రుస‌గా రెండు, మూడు ప్లాపులు వ‌చ్చాయంటే చాలు ఏదో ఒక హిట్ సినిమాను రీమేక్ చేసి స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతున్నారు. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి లూసీఫ‌ర్ రీమేక్‌తో వ‌స్తున్నాడు.

అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో రీమేక్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఇక యంగ్ హీరో నితిన్ కూడా అంధాదున్ రీమేక్ కోసం ప్లాన్ వేశాడు. ఇప్ప‌టికే వెంక‌టేశ్ నార‌ప్ప రీమేక్‌ను కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నాడు. అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా క‌ర్ణ‌న్ రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇవ‌న్నీ త‌మిళ రీమేక్ సినిమాలే కావ‌డం ఇక్క‌డ మ‌రో విశేషం. ఏదేమైనా మ‌న ఇండ‌స్ట్రీ ఇంకా త‌మిళం మీదే ఆధార‌ప‌డుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news