గుడిలో ఆ పని చేసి అడ్డంగా బుక్కైన హీరోయిన్..!

ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో తెలియని కొందరు భామలు అనవసరంగా బుక్కవుతుంటారు. రీసెంట్ గా తనకు తెలిసి చేసిందో లేక తెలియక చేసిందో కాని తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తున్న నివేదా పేతురాజ్ నెటిజెన్లకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ ఆమె ఏం చేసింది అంటే మధుర మీనాక్షి టెంపుల్ లో ఫోటోస్, వీడియోస్ దిగడమే కాకుండా ఆ ఫోటోస్ ను తన సోషల్ మీడియాలో పెట్టుకుంది.

ఆ గుడిలో సెల్ ఫోన్ వాడకం నిషేధం. అక్కడకు వెళ్లి సెల్ వాడడమే కాకుండా గుడిలో ఫోటోలు దిగినందుకు ఆమె మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు సెలబ్రిటీస్ కాబట్టి సెక్యురిటీ ఆమెను పెద్దగా పట్టించుకోలేదని అదే సామాన్య జనాన్ని అయితే అలా చేయనివ్వరని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనతో హీరోయిన్ నివేదా పేతురాజ్ తో పాటుగా ఆలయ సిబ్బందికి అధికారులు అక్షింతలు వేశారని తెలుస్తుంది. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ సాయి తేజ్ హీరోగా వస్తున్న చిత్రలహరి సినిమాలో నటిస్తుంది.