వచ్చే ఎన్నికల్లో మీరు ఓటేస్తున్నారా? ఓటింగ్ ఎప్పుడో మీకు తెలుసా? ఏప్రిల్ 9న ఓటింగ్. పోయి.. టీడీపీకి ఓటు గుద్ది వచ్చేయండి.. ఓకేనా? ఇది మేం చెబుతున్నది కాదు… మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేశుడి మాటలు ఇవి.. నమ్మరా అయితే ఇది చదవండి..
నారావారి అబ్బాయి లోకేశ్ బాబు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే.. ఆయన చాలాసార్లు ఒకటి చెప్పబోయి ఇంకోటి.. ఏదో అనబోయి ఇంకేదో అంటూ ప్రజల ముందు అడ్డంగా బుక్కవ్వడం కామన్. లోకేశ్ సంగతి అందరికీ తెలుసు. దీంట్లో కొత్తేమీ లేదు. కానీ.. ఇకనైనా ఆయన మాట్లాడే పద్ధతి మారాలి కదా. ఒక రాష్ట్రానికి మంత్రి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇలా అయితే ఎలా అంటూ నెటిజన్లు లోకేశ్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు అని అంటారా?
ఆయన తన ప్రచారంలో భాగంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగానగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా లోకేశ్ మాట్లాడారు. టీడీపీకే అందరూ ఓట్లేయాని కోరారు. ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగుతున్నాయని… ఆరోజు అందరూ టీడీపీకి తప్పకుండా ఓట్లేయాలని ఆయన కోరారు. నిజానికి ఎన్నికలు జరిగేది ఏప్రిల్ 11న. కానీ.. లోకేశ్ ఏప్రిల్ 9న ఎన్నికలు అంటూ అనేసరికి అక్కడికి వచ్చిన వాళ్లంతా కాసేపు తమలో తామే నవ్వుకున్నారు.
అక్కడ టీడీపీ నేతలు ఉంటారు కదా. వాళ్లలో బండి చిరంజీవి అనే నాయకుడు… లోకేశ్ దగ్గరికి వెళ్లి 9 కాదు సార్.. 11 అంటూ చెప్పే సరికి.. దాన్ని కవర్ చేసుకోవడానికి లోకేశ్ పడ్డ బాధలు వర్ణణాతీతం. ఎన్నికల డేట్ ను కూడా మరిచిపోయే ఇటువంటి వ్యక్తులకా ఓట్లేసి గెలిపించేది.. అంటూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారట.
ఇక.. లోకేశ్ కు పోటీగా వస్తున్న వైఎస్సాఆర్సీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ఊరుకుంటారా? నారా లోకేశ్ గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటేయండంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్, లోకేశ్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
.@naralokesh గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి
ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి#VoteForFan #TDPLosing pic.twitter.com/DMzYMNA2H2
— Rama Krishna Reddy A (@MlaRKR) March 21, 2019