ఎన్నికల బరిలో తెలుగు హీరోయిన్.. ఖమ్మం నుండి పోటీ

-

తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణాలో మరో నెలలోనే ఎలక్షన్స్ ఉండగా ఏపిలో వచ్చే ఏడాది జరుగనున్నాయి. అయితే ఊపందుకున్న తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదిలాఉంటే తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో వైరా నియోజక వర్గం నుండి ఈరోజుల్లో ఫేం రేష్మ రాథోడ్ బరిలో దిగుతుందని తెలుస్తుంది. ఈమధ్యనే బిజేపిలో చేరిన ఆమె ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం. ఈరోజుల్లో సినిమాతో పాపులర్ అయిన రేష్మ ఆ తర్వాత కూడా ఐదారు సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం సినిమా కెరియర్ అంత శాటిస్ఫైడ్ గా లేకున్నా ఎం.ఎల్.ఏ గా పోటీ చేసేంత క్రేజ్ తెచ్చుకుంది అంటే గొప్ప విషయమే అని చెప్పాలి. వైరా నుండి టి.ఆర్.ఎస్ నుండి బాణోతు మదన్ లాల్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మదన్ లాల్ కూడా భారీగా ప్రచారం చేస్తున్నారు. అయితే స్థానికంగా ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది. ఇక బిజేపి తరపున బరిలో దిగుతున్న రేష్మ కూడా త్వరలో వైరా నియోజక వర్గంలో ప్రచారాన్ని చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news